ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య కార్మికుడిపై దాడి

ABN, First Publish Date - 2020-03-27T11:00:31+05:30

స్థాపలాస, మార్చి 26: స్థానిక జయరామచంద్రపురంలో పారిశుధ్య కార్మికుడిపై బుధవారం రాత్రి ఓ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, మార్చి 26: స్థానిక జయరామచంద్రపురంలో పారిశుధ్య కార్మికుడిపై  బుధవారం రాత్రి ఓ వలంటీర్‌ దాడిచేసిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...  పారిశుధ్య కార్మికులు శేఖర్‌బిసాయ్‌, సుజాత బిసాయ్‌, కె.సతీష్‌  జయరామచంద్రపురంలో  బ్లీచింగ్‌ చల్లుతున్నారు. ఈ గ్రామానికి చెందిన ఓ వలంటీరు తమ ఇళ్ల వద్దకూడా చల్లాలని కోరారు.  అధికారులు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలు, కాలువల వద్దే బ్లీచింగ్‌ చేయాలని సూచించారని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.


దీంతో వలం టీరు పారిశుధ్య కార్మికుడు శేఖర్‌బిసాయ్‌పై చేయిచేసుకున్నాడు. అనంతరం ఈ విషయం  కార్మిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే వలంటీరుపై చర్యలు తీసుకోవాలని కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పారిశుధ్య కార్మికసంఘ అధ్యక్షుడు సీహెచ్‌.మురుగన్‌ తెలిపారు.  కార్మికులకు న్యాయం చేయకపోతే పారిశుధ్యపనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.  కార్మికుడిపై దాడి జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని  మునిసిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇరువర్గాలను పిలిచామని, ఈ విషయంపై విచారణ జరుపుతామని చెప్పారు.

Updated Date - 2020-03-27T11:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising