ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరోనా ఉధృతికి సంబంధించి ఇవాల్టి అప్‌డేట్

ABN, First Publish Date - 2020-09-18T22:32:20+05:30

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో శుక్రవారం కొత్తగా 8,096 పాజిటివ్ కేసులు నమోదయినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో కొత్తగా 8,096 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏపీలో శుక్రవారం కొత్తగా 8,096 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. కొత్తగా నమోదైన కేసులను ఒక్కసారి పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1035 కరోనా కేసులు, చిత్తూరు జిల్లాలో 902 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 713, గుంటూరు 513, కృష్ణా 487, నెల్లూరు 468, అనంతపురం 463, కడప 419, విశాఖపట్నం 371, కర్నూలు జిల్లాలో 337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 67 మంది కరోనా సోకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా కడప 8, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ గోదావరి జిల్లా 4, ప్రకాశం 3, విజయనగరం 3, కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,244కి చేరింది. ఏపీలో గత 24 గంటల్లో 74,710 శాంపిల్స్ ను పరీక్షించారు.



Updated Date - 2020-09-18T22:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising