విశాఖకు అంబులెన్స్ సౌకర్యం
ABN, First Publish Date - 2020-03-27T11:03:06+05:30
విశాఖకు వెళ్లే కిడ్నీ రోగులకు అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులు విశాఖపట్నం కేజీహెచ్, వి మ్స్, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. కరోనా
పలాస, మార్చి 26: విశాఖకు వెళ్లే కిడ్నీ రోగులకు అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ రోగులు విశాఖపట్నం కేజీహెచ్, వి మ్స్, ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్ చేసుకుంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీది రి అప్పలరాజు దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పం దిస్తూ జిల్లా అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో అంబులెన్స్ విశాఖపట్నం వెళ్లేందుకు అధికారులు అంగీకరించారు. విశాఖపట్నం వెళ్లే రోగులు అంబులెన్స్ కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి సంప్రదించాలని ఎమ్మెల్యే తెలిపారు.
Updated Date - 2020-03-27T11:03:06+05:30 IST