ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంటైన్మెంట్‌ జోన్లలో అప్రమత్తం

ABN, First Publish Date - 2020-06-25T11:35:32+05:30

కంటైన్మెంట్‌ జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ సుమిత్‌కుమార్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి

జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌


ఇచ్ఛాపురం, జూన్‌ 24 : కంటైన్మెంట్‌ జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ సుమిత్‌కుమార్‌ కోరారు. బుధవారం ఇచ్ఛాపురంలోని కంటైన్మెంట్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.కరోనా కేసులు మండలం, మునిసిపాలిటీ పరిధిలో పెరుగుతున్న నేపథ్యంలో  అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జోన్‌లో ఉన్న ప్రతిఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి శ్యాంపిళ్లను టెక్కలి  తరలించాలని తెలిపారు.  కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, తాగునీరు అందజేయడంపై   కమిషనర్‌ లాలం రామలక్ష్మికి అడిగి తెలుసుకున్నారు.


ఆయన వెంట పట్టణ ఎస్సై సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా  ఇచ్ఛాపురం  సీహెచ్‌సీలో సూపరింటెండెంట్‌ దామోదర్‌ ప్రధాన్‌ ఆసుపత్రి ఆవరణలోనే ప్రైవేటుగా మందులు విక్రయిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు జేసీ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.  పీర్లకొండ ఆ క్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి 

ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జేసీ  సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం బూర్జ మండలంలోని ఓ  గ్రామం కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించడంతో పరిశీలించారు.   గ్రామంలో తీసుకుంటున్న చర్యలపై తహసీల్దార్‌ సావిత్రిని అడిగితెలుసుకున్నారు.

Updated Date - 2020-06-25T11:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising