చెక్‌పోస్టు వద్ద అప్రమత్తం: ఎస్పీ
ABN, First Publish Date - 2020-06-18T11:18:32+05:30
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. బుధవారం చెక్‌పోస్టును తనిఖీ
ఇచ్ఛాపురం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. బుధవారం చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్ష కేంద్రా న్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ వినోద్‌బాబు, పట్టణ, రూరల్ ఎస్సైలు సత్యనారాయణ, లక్ష్మి, చెక్‌పోస్టు ఇన్‌చార్జి గోవిందరావు పాల్గొన్నారు.
పాలకొండ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. బుధవారం పాలకొండ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా డివిజన్‌లో పర్యటించారు. సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల సమస్యలను అడిగితెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో టెంటు వేసి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.ఆయనతోపాటు సీఐ ఆదాం, ఎస్‌ఐ జనార్దన్ ఉన్నారు.
కలెక్టరేట్: కలెక్టర్ కార్యాలయంలోని కొవిడ్-19 కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ అమిత్ బర్దార్ బుధవారం పరిశీలించారు. కంట్రోల్ రూమ్ నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు అంతా కలసికట్టుగా పని చేయాలన్నారు. అవసరమైన చోట పోలీసు సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాద్, ఎస్‌బీఐ సీఐ నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-06-18T11:18:32+05:30 IST