ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-11-28T05:06:26+05:30

రైతులకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణా రావు డిమాండ్‌ చేశారు.

రాస్తారోకో చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: రైతులకు వ్యతిరేకంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణా రావు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల కోఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో  స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి   రమణారావు మాట్లాడుతూ,  రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, జీవో నెం 22ను ఉపసంహరిం చాలని, వ్యవసాయానిక ఉచిత విద్యుత్‌ విధానం యథాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కాద రాము, అర్త మూడి లక్ష్మణరావు, దూసి దుర్గారావు, కుప్పిలి శ్రీనివాస్‌,  తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు కార్మిక వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోట దుర్గమ్మ ఆలయం వద్ద నిరసన, రాస్తారోకో కార్యక్రమం చేప ట్టారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బుడితి అప్పలనాయుడు, కిమిడి రామ మూర్తినాయుడు, ద్వారపూడి అప్పలనాయుడు, బబ్బాది శివ,  తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-11-28T05:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising