కలప అక్రమ రవాణాపై చర్యలు తప్పవు
ABN, First Publish Date - 2020-11-13T05:46:14+05:30
అక్రమంగా కలప రవాణా చేసిన వారిపై చర్యలు తప్పవని జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ కృపాకర్ తెలిపారు.
మెళియాపుట్టి : అక్రమంగా కలప రవాణా చేసిన వారిపై చర్యలు తప్పవని జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ కృపాకర్ తెలిపారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఇంటి దొంగలు పనేనా?’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి ఆ యన స్పందించారు. కలప అక్రమంగా తరలింపులో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైం దని, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. కాగా ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలు స్తుంది. గత కొంత కాలంగా అటవీశాఖలో పనిచేస్తున్న ఒక అధికారి కలప వ్యా పారం చేయడంపై వివరాలు సేకరిస్తున్నట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
Updated Date - 2020-11-13T05:46:14+05:30 IST