ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ నైపుణ్యాలతోనే ఉజ్వల భవిత

ABN, First Publish Date - 2020-12-06T05:18:35+05:30

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలతోనే ఉజ్వల భవిత సాధ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో డసాఫ్ట్‌ సిస్టమ్స్‌, సీఎం స్కిల్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఆయన శనివారం ప్రారంభించారు.

డసాఫ్ట్‌ సిస్టమ్‌ను ప్రారంభిస్తున్న ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ మధుసూదనరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ మధుసూదనరెడ్డి

బీఆర్‌ఏయూలో డసాఫ్ట్‌ సిస్టమ్‌, సీఎం ఎక్స్‌లెన్స్‌ ప్రారంభం 

ఎచ్చెర్ల, డిసెంబరు 5: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలతోనే ఉజ్వల భవిత సాధ్యమని ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధుసూదనరెడ్డి తెలిపారు. అంబేడ్కర్‌ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో డసాఫ్ట్‌ సిస్టమ్స్‌, సీఎం స్కిల్‌ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధునాతన సాఫ్ట్‌వేర్‌లను విద్యార్థులకు అందించేందుకు ప్రపంచ స్థాయి సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంట్నుట్టు చెప్పారు. ‘రాష్ట్రంలో డసాల్ట్‌ సిస్టమ్స్‌ను 60 కళాశాలల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం రూ.36 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాలుగేళ్ల అకడమిక్‌ ప్రోగ్రాంకు సమాంతరంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. సృజనాత్మక ఆలోచనలు వెలికితీసి, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం.  అంబేడ్కర్‌ వర్సిటీలో రోబో టిక్‌ ప్రాజెక్ట్‌ ఆటోమిషన్‌, ఎంబడెడ్‌ సిస్టమ్‌లను త్వరలో ప్రారంభిస్తాం’ అని మధుసూదనరెడ్డి తెలిపారు. వీసీ ప్రొఫెసర్‌ కూన రాంజీ మాట్లాడుతూ, మార్కెట్‌లోని ఉద్యోగాల్లో ప్రతి 6 నెలలకు మార్పులు వస్తున్నాయని తెలిపారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. ప్రతి సెమెస్టర్‌లో అదనపు నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కె.రఘుబాబు, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డీవీ రామకోటిరెడ్డి, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ గుజ్జల రవి, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా నైపుణ్యాభివృద్ధి అఽధికారి   ఎన్‌.గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-06T05:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising