ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్పెషల్‌’ బదిలీలు

ABN, First Publish Date - 2020-09-25T08:43:33+05:30

సుదీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర విధులు! ఎనిమిదేళ్లుగా చేస్తున్న స్కూలులోనే వేలమంది డ్యూటీలు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీచర్ల బదిలీలపై నిషేధమున్నా స్పెషల్‌ కేసు కింద యథేచ్ఛగా..


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

సుదీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర విధులు! ఎనిమిదేళ్లుగా చేస్తున్న స్కూలులోనే వేలమంది డ్యూటీలు! వీరు కాకుండా కొత్తగా మరో లక్షమంది కొత్తగా లైనులో ఉన్నారు. టీచర్ల బదిలీలను చేపడతామని ఇప్పటికి మూడుసార్లు సీఎం ప్రకటిస్తే, విద్యాశాఖ సమీక్ష జరిగిన ప్రతిసారీ ఆ శాఖ మంత్రి ఇదే చెబుతున్నారు. కానీ కౌన్సెలింగ్‌ తేదీలను ఏడాదిన్నరగా ప్రకటించడం లేదు. అయితే ఇదంతా ఒకవైపే! మరోవైపు నుంచి జరిగే బదిలీలు జరిగిపోతూనే ఉన్నాయి.


ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై నిషేధం ఉంది. అయినా, పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు పైచెయ్యి సాధించిన చోట స్పెషల్‌ కేసుల కింద లాగించేస్తున్నారు. రూల్స్‌కి విరుద్దంగా జరిగే ఈ బదిలీలకు జీవోలు విడుదల చేయరు. మెమోలు మాత్రం ఇస్తున్నారు. సీఎం సొంతజిల్లా కడపలో సర్కారీ బదిలీలు అత్యధికంగా ఉన్నాయని సమాచారం. పరస్పర బదిలీలు అంతర్‌జిల్లా బదిలీలు సైతం ఇదే జిల్లాలో జరుగుతున్నాయి. రిటైర్మెంట్‌ కారణంగా ఏర్పడే ఖాళీలు, 20శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రదేశాలు, నగరాలు/పట్టణాలకు సమీపంలో ఉండే స్కూళ్లకు సిఫారసుల బదిలీలు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.


మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు తమకు కావాల్సినవారి బదిలీలకు సిఫారసులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వందల సంఖ్యలో బదిలీల మోమోలు విడుదల కాగా, మరికొన్ని వందల మంది బదిలీలు ప్రాసె్‌సలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో జరిగిన బదిలీలు తాజాగా వెలుగు చూశాయి. 


Updated Date - 2020-09-25T08:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising