ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో భూ కబ్జాలు!

ABN, First Publish Date - 2020-09-21T03:15:05+05:30

విశాఖలో భూ కబ్జాలు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ నగరంలో భూబకాసురులు జడలు విప్పుతున్నారా?. ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరమయ్యేందుకు అధికారులు సహకరిస్తున్నారా?. వివాదాస్పద భూముల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతుందా?.


విశాఖ ప్రశాంతతకు నిలయం. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇదొకటి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోనే అతి పెద్ద నగరంగా విరాజిల్లుతున్న విశాఖ..ఇప్పుడు పాలనా రాజధానిగా మారింది. దీంతో విలువైన భూములపై అధికార పార్టీ  నేతల కన్ను పడింది. టీడీపీ హయాంలో భూ కుంభకోణాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ ఇంతవరకూ సిట్ రిపోర్టు వెలుగు చూడలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విశాఖ రెవెన్యూ పరిధిలోని సర్కారీ భూములు, ఏపీ ఐఐసీసీ స్థలాలు బీఫామ్ పట్టాలతో పాటు మాజీ సైనికులు, రైట్ క్వారీ పట్టా భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణలన్నీ ఒక్కొక్కటి సక్రమం అయిపోతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ భూమి పరిస్థితి ఎలా ఉందో చెకింగ్ చేసుకుంటున్నారు. 


వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంతవరకూ చాపకింద నీరులా సాగిన భూదందా ఇప్పుడు జడ విప్పుతోంది. మధురవాడ సర్వే నెంబర్ 367/1లోని సర్కారీ భూమిలో అక్రమంగా అపార్ట్ మెంట్ పనులు చేపట్టారు. ఈ సర్వే నెంబర్ లో 9.27గా ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ 1,9,7,1 రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఇందులో సబ్ డివిజన్ చేసి 367/1లో 3.25 ఎకరాలను గంటి సూర్యనారాయణకు 367/2లో 3.92 ఎకరాలను సురవజ్జల  నాగభూషణం అనే రాజకీయ వేత్తకు కేటాయించారు. మిగిలిన 2.10 ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 


అయితే గంటి సూర్యానారాయణ, సురవజ్జల నాగభూషణం వారసులు ఈ భూమిని స్వాధీనం చేసుకోలేదు. దీంతో రియల్టర్ల కన్ను పడింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి నాలుగో సబ్ డివిజన్ చేసి 2.85 ఎకరాలు తుమురోతు అప్పన్నకు  చెందిన స్థలంగా చూపించారు. తర్వాత దానిని కొనుగోలు చేసినట్టు చూపించి జీవీఎంసీ నుంచి అనుమతి పొందారు. 2016లో ఈ తంతగాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో సర్వే నెంబర్ 367లో భూమి మొత్తం సర్కార్ దేనని తేల్చారు. కానీ ఇప్పుడు ఇదే భూమిలో అధికార పార్టీ నేతల హస్తంతో మళ్లీ నిర్మాణాలు కట్టడం ప్రారంభించేశారు. విషయం కాస్త రచ్చకెక్కడంతో పనులు నిలిపివేయాలని ఆర్డీవో, ఎమ్మార్వో ఆదేశాలు ఇచ్చారు. 

Updated Date - 2020-09-21T03:15:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising