ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల నిత్య దేవుడు ఆనంద గజపతిరాజు

ABN, First Publish Date - 2020-11-01T02:23:30+05:30

మాన్సస్ ట్రస్ట్ నిత్య వివాదాల పుణ్యమా అని పూసపాటి రాజావార్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వారసుల మధ్య రాజకీయాలు రాజేసి పబ్బం గడుపుకుంటున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: మాన్సస్ ట్రస్ట్ నిత్య వివాదాల పుణ్యమా అని పూసపాటి రాజావార్ని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. వారసుల మధ్య రాజకీయాలు రాజేసి పబ్బం గడుపుకుంటున్న నేతను ఓ వైపు తిట్టుకుంటూనే మరోవైపు ఆనంద గజపతిరాజును మదిలో తలుచుకుంటున్నారు. అప్పట్లో ఆయన అందించిన సేవలను ఇప్పటి వివాదాలతో పోల్చుకుని ఎలాంటి వంశానికి ఎలాంటి పరిస్థితి దాపురించిందా? అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే వారు. సొంత ఆస్తులను తనఖా పెట్టి ఎంపీజీఆర్‌ను ఏర్పాటు చేశారు. మహిళలంటే ఎంతో గౌరవం. ముఖ్యంగా మధ్య తరగతి మహిళ సొంత కాళ్లపై నిలబడాలని అంటూ ఉండేవారు. చిన్నారులు బాగా చదివి వృద్ధిలోకి రావాలని చెబుతూ ఉండేవారు. విజయనగరంలో ఎవర్ని అడిగిన ఆనందగజపతిరాజు గురించి చెప్పే మాటలివి. చూడటానికి చాలా సాధారణంగా ఉండేవారు. మృదుస్వభావి. పెద్ద జమిందార్ననే అహం ఆనందుడిలో అసలు కనిపించేవికావు.


విద్య నేర్చుకుంటే ఎంత గౌరవం పొందవచ్చునో తెలిసిన వాడు. అందుకే బాగా చదివి విద్యాధికుడు అయ్యాడు. దేశ, విదేశాల్లోని యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. తాను చదువుకోవడమే కాదు ఊళ్లో అందరూ చదువుకోవాలని ఆశించిన వారు. విద్యానగరమని విజయనగరానికి ఉన్న పేరును సార్థకం చేయడానికి ఎంతకాలమో కృషి చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన యంగిస్థాన్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని రేపటి తరానికి దిశానిర్దేశం చేశారు. 

Updated Date - 2020-11-01T02:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising