ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 రోజులపాటు అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

ABN, First Publish Date - 2020-05-24T02:44:10+05:30

5 రోజులపాటు అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఐదు రోజులు పాటు అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 25 నుంచి 30 వరకు ప్రతి రోజు అంశాల వారిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఉదయం రాష్ట్ర స్థాయి సమీక్ష చేస్తారని, జిల్లాలో ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో ప్రగతిపై సమీక్ష ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రతి రోజు ఒక అంశంపై చర్చా గోష్ఠి ఉంటుందని, ప్రతిభతోపాటు లబ్ధిదారులు, నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్పారు. అమ్మవడి సచివాలయ వ్యవస్థ లాంటి కొన్ని ప్రతిష్టాత్మక పథకాలపై చర్చిస్తామన్నారు. నెల మొదటి రోజునే  90 శాతం పింఛన్లు ఇస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. 25న సంక్షేమ పథకాలపై, 26న వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఆధునిక పద్దతులు, 27న విద్య ,28న పరిశ్రమలు, 29 న ఆరోగ్యం పై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభం ఉంటుందని, ఉయ్యురులోని గండిగుంట గ్రామంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో ముందడుగు వేసిన అంశాలపై నిపుణుల అభిప్రాయాల సేకరణ ఉంటుందని, 25 నుంచి 30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు చర్చా కార్యక్రమాలు చెప్పారు. విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ. 31 కోట్లతో రైవస్ కాలువ, ఏలూరు కాలువ, బుడమేరు కాలువలపై రెండు వరుసల వంతెనల నిర్మాణానికి అనుమతులు లభించాయని కలెక్టర్ తెలిపారు.

Updated Date - 2020-05-24T02:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising