జగన్ ఇంతలా దిగజారిపోయి ప్రవర్తించడం మంచిది కాదు: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2020-03-16T17:37:39+05:30
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇంతలా దిగజారిపోయి ప్రవర్తించడం రాష్ట్రానికే మంచిది కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ ఇంతలా దిగజారిపోయి ప్రవర్తించడం రాష్ట్రానికే మంచిది కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల వాయిదాపై జగన్ విరుచుకుపడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో అలహాబాద్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీకి ఉండే అధికారాలే.. స్థానిక ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీకి ఉంటాయని ఆ తీర్పు స్పష్టం చేసిందని సోమిరెడ్డి వెల్లడించారు. బెంగాల్‌లో వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని.. సాక్షాత్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష పార్టీలన్నీ కోరాయన్నారు. ఎస్‌ఈసీని జగన్, విజయసాయిరెడ్డి ప్రశ్నించడం.. కులాలు అంటగట్టడం దురదృష్టకరమన్నారు. నామినేషన్లు, స్క్రూటీని, విత్ డ్రాలు అయిపోయాయని సోమిరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2020-03-16T17:37:39+05:30 IST