ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎంపీల సేవలు వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2020-03-13T09:45:29+05:30

ఆర్‌ఎంపీ వైద్యులకు చట్టబద్ధత కల్పించి హెల్త్‌ ప్రొవైడర్లుగా సేవలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ప్రతినిధులు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి


గుంటూరు (మెడికల్‌) మార్చి 12: ఆర్‌ఎంపీ వైద్యులకు చట్టబద్ధత కల్పించి హెల్త్‌ ప్రొవైడర్లుగా సేవలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ప్రతినిధులు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం న్యూఢిల్లీలోని జాన్వరి మార్గ్‌లో కేంద్ర మంత్రిని కలసిన సమాఖ్య అదనపు కార్యదర్శి జంగం జోషి, ఉత్తరాంధ్ర జోనల్‌ కార్యదర్శి బి. గోపాలరావు తదితరులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఎంపీలకు  చట్టబద్ధత కల్పించేందుకు గతంలో 429 జీవో జారీ చేసినా అనివార్య కారణాల వ ల్ల నేటికి అమలు కాలేదన్నారు.


ఈ జీవో అమలయ్యే విధంగా చర్యలు తీసుకొంటే  గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కొరత తీరుతుందన్నారు. ఆర్‌ఎంపీ వైద్యులకు కొద్ది పాటి శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవచ్చని జోషి వివరించారు. కార్యక్రమంలో ఢిల్లీ ఆర్‌ఎంపీల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జోషి, గోపాలరావు విలేకరులతో మాట్లాడుతూ తమ విజ్ఞప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ సానుకూలంగా స్పందించినట్టు,  ఎన్‌ఎంసీకి సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారని వారు పేర్కొన్నారు.


Updated Date - 2020-03-13T09:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising