ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు పెరిగినా... ఆందోళన వద్దు... డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి

ABN, First Publish Date - 2020-08-02T21:32:18+05:30

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో గత నాలుగు రోజుల నుంచి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో... పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు, ఎయిమ్స్‌ ఢిల్లీ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారు డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్టాతుతూ ‘కరోనా తీవ్రత ఒక స్థాయి వరకు పెరిగి... ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది’ అని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో గత నాలుగు రోజుల నుంచి కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో... పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు, ఎయిమ్స్‌ ఢిల్లీ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ గౌరవ సలహాదారు డాక్టర్ శ్రీనాథరెడ్డి మాట్టాతుతూ ‘కరోనా తీవ్రత ఒక స్థాయి వరకు పెరిగి... ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది’ అని వెల్లడించారు. 


ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకిన వాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా చేయడమే అసలైన మందు అని పేర్కొన్నారు. 

 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సూత్రాన్నే అత్యంత పకడ్బందీగా అమలు చేయాల్సి ఉందని సూచించారు. మరణాలను నియంత్రించడమే వైరస్ ను ఎదుర్కోవడంలో అతిపెద్ద సవాల్ అని స్పష్టం చేశారు. 


ఏపీలో రోజుకు 70 వేల కరోనా పరీక్షలు జరుపుతుండగా, పది వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వెల్లడించారు.  ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2020-08-02T21:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising