ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు

ABN, First Publish Date - 2020-03-29T08:40:07+05:30

ప్రపంచం యావత్తూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చినముషిడివాడలో గల శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి (విశాఖపట్నం) మార్చి 28: ప్రపంచం యావత్తూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చినముషిడివాడలో గల శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వీయ పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషజ్వరపీడ హర, అమృత పాశుపత యాగాలు శనివారం ముగిశాయి. పీఠం ప్రాంగణంలోని యాగశాలలో 11 రోజులుగా చేపట్టిన ఈ యాగాలకు రుత్వికులు శాస్ర్తోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు.


ఈ సందర్భంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణ చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు, సర్వ మానవాళి ఆరోగ్యం కోసం ఈ యాగాన్ని చేపట్టామన్నారు. యాగంతో పాటు అరుణపారాయణ, అపమృత్యుదోష నివారణ కోసం మంత్రోచ్ఛారణ పఠనం చేశామన్నారు. భారతదేశం ప్రపంచానికే గురుస్థానంలో ఉందని తెలిపారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని సూచించారు. అన్నార్తులను ఆదుకోవాలని భక్తులకు స్వామీజీ పిలుపునిచ్చారు.


Updated Date - 2020-03-29T08:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising