ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సంకెళ్లు ఘటనలో..

ABN, First Publish Date - 2020-10-29T08:41:32+05:30

రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో గుంటూరు రూరల్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఆరుగురిని సస్పెండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరుగురు ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

ఆర్‌ఎస్సై, ఆర్‌ఐలకు మెమోలు..  విచారణకు ఆదేశం

గుంటూరు, అక్టోబరు 28: రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో గుంటూరు రూరల్‌ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఆరుగురిని సస్పెండ్‌ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్‌ఎ్‌సఐ, ఆర్‌ఐలకు చార్జిమెమోలు ఇచ్చారు. ఈ వ్యహారంపై ఏఆర్‌ అదనపు ఎస్పీ స్థాయి అధికారి విచారణకు ఆదేశించినట్లు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ బుధవారం తెలిపారు.


నరసరావుపేట సబ్‌జైలు నుంచి 43 మంది రిమాండ్‌ ఖైదీలను మంగళవారంనాడు గుంటూరు జిల్లా జైలుకు తరలించిన విషయం విధితమే. వారికి గుంటూరు రూరల్‌ ఏఆర్‌ పోలీసులను ఎస్కార్ట్‌గా నియమించారు. రిమాండ్‌ ఖైదీలను సంకెళ్లు వేసి తరలించే క్రమంలో అందులో ఉన్న ఏడుగురు రాజధాని రైతులకు కూడా సంకెళ్లు వేశారు.

ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై ఎస్పీ విశాల్‌గున్నీ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏఆర్‌ అదనపు ఎస్పీ, డీఎస్పీలను ఆదేశించినట్టు చెప్పారు.


Updated Date - 2020-10-29T08:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising