భక్తుడి ముసుగులో శేషాచలం అటవీ ప్రాంతంలోకి...
ABN, First Publish Date - 2020-12-17T17:14:21+05:30
తిరుమల: భక్తుడి ముసుగులో శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎర్రచందనం కూలిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది.
తిరుమల: భక్తుడి ముసుగులో శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎర్రచందనం కూలిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. కూలి వద్ద నుంచి మూడు జతల దుస్తులను స్వాధీనం చేసుకుంది. బస్సులో తెల్లటి దుస్తులు... తిరుమలలో భక్తుడిలా కనిపించేందుకు కాషాయం రంగు దుస్తులు...అడవిలో సంచరించేందుకు బనియన్, నిక్కర్‌ను తెచ్చుకున్నాడు. నిందితుడు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా వెళ్లిచెరువు గ్రామానికి చెందిన వేంకటేశన్‌గా అధికారులు గుర్తించారు. పారిపోయిన మరికొంత మంది కూలీల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2020-12-17T17:14:21+05:30 IST