ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయానికి భద్రత పెంపు

ABN, First Publish Date - 2020-03-23T10:27:28+05:30

తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ భద్రత పెంచింది. వారంరోజుల పాటు దర్శనాలు రద్దు చేయడంతో కొండ నిర్మానుష్యంగా మారింది. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మార్చి 22: తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ భద్రత పెంచింది. వారంరోజుల పాటు దర్శనాలు రద్దు చేయడంతో కొండ నిర్మానుష్యంగా మారింది. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గొల్లమండపం, ఆలయం లోపల, పైభాగాలతో దాదాపు 10గార్డుల ద్వారా 50 మంది సిబ్బంది ఆయుధాలతో పహరా కాస్తున్నారు. వందమంది విజిలెన్స్‌, పోలీసులు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది మాడవీధులు, ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు. 12మందితో కూడిన రెండు సాయుదులైన ఆక్టోపస్‌ బృందాలు ఆలయంతో సహా అన్ని ప్రదేశాల్లో పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. రెండు బ్యాటరీ వాహనాల్లో ఎస్పీఎఫ్‌ సిబ్బంది మాడవీధుల్లో తిరుగుతున్నారు. అలిపిరి నుంచి తిరుమలలోని బస్టాండు, వైకుంఠం క్యూకాంప్లెక్సులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయం, అఖిలాండం, అన్నప్రసాద భవనం, ఘాట్‌రోడ్లు, మఠాలు వంటి ప్రాంతాల్లో దాదాపు 500 మంది విజిలెన్స్‌, పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇక, జనతా కర్ఫ్యూతో ఆదివారమంతా తిరుమల స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 గంటలకు వైద్యులు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లతో అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-03-23T10:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising