ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు: మోపిదేవి

ABN, First Publish Date - 2020-10-29T01:03:19+05:30

ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తప్పుబట్టారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తప్పుబట్టారు. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీల సలహాలతో ఎన్నికలు పెడతారా?అని ప్రశ్నించారు. కరోనా పేరుతో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా వేశారని, కరోనా కేసులు వేలల్లో ఉంటే ఇప్పుడెలా ఎన్నికలు నిర్వహిస్తారని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై టీడీపీ ఎజెండా అమలు చేస్తున్నారని, నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారశైలి మార్చుకోవాలని మోపిదేవి వెంకటరమణ హితవుపలికారు. 


కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో రమేశ్‌కుమార్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరమేమిటని, దీనిపై నవంబరు 2లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని  రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్‌ నిర్ణయించారు. ఆ మేరకు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ డుమ్మాకొట్టింది.

Updated Date - 2020-10-29T01:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising