రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ లేఖ
ABN, First Publish Date - 2020-03-16T15:32:16+05:30
ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు.
అమరావతి: ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని సూచించారు. పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చు అని సీఎస్ పేర్కొన్నారు. మరో 3, 4 వారాలు కరోనా అదుపులోనే ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు యథాతథంగా నిర్వహించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2020-03-16T15:32:16+05:30 IST