ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్ఈసీ అఖిలపక్ష భేటీ నేడు

ABN, First Publish Date - 2020-10-28T15:41:52+05:30

బెజవాడలో బుధవారం కీలక సమావేశం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెజవాడలో బుధవారం కీలక సమావేశం జరగనుంది. రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది. అయితే వైసీపీ ఈ సమావేశానికి గైర్హాజరవుతుందని సమాచారం. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రా ఎన్నికల సంఘం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను  గత మార్చిలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  వాయిదా వేశారు. 


ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం ఏంటని, దీనిపై నవంబర్ 2లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు.

Updated Date - 2020-10-28T15:41:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising