ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎస్‌ఈసీ’ తీర్పుపై సుప్రీంకు సర్కార్‌

ABN, First Publish Date - 2020-06-02T07:51:59+05:30

రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు ఉత్తర్వులపై పిటిషన్‌

‘ఎస్‌ఈసీ’ తీర్పుపై సుప్రీంకు సర్కార్‌

హైకోర్టు ఉత్తర్వులు సవాల్‌ చేస్తూ పిటిషన్‌


న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకే జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించామని పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పిటిషన్‌ రెండు మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.


‘స్టే’పై హైకోర్టులో నేడు విచారణ

ఎస్‌ఈసీ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నామని, ఈ నేపథ్యంలో సదరు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో మే 30న పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. 

Updated Date - 2020-06-02T07:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising