సర్కారు సుప్రీంకు... ఎస్‌ఈసీ హైకోర్టుకు..
ABN, First Publish Date - 2020-06-01T08:09:23+05:30
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ..
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ధర్మాసనం తీర్పును అమలు చేయకుండా, తాను బాధ్యతలను స్వీకరించినట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ధిక్కరించడంపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టు ధిక్కారం కింద పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు.
తాను చార్జ్ తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైకోర్టు వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించడమా లేక సెలవుల అనంతరం పిటిషన్ వేయాలా అనే అంశంపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ కేసు తీర్పును హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఇవ్వడంతో ఇప్పుడు కోర్టు ధిక్కారం కేసు కూడా ఆ బెంచ్ వద్దకే వెళ్లాల్సి ఉంది. వేసవి సెలవుల్లో ఆ బెంచ్ లేనందున తిరిగి న్యాయవాదులతో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నారు.
Updated Date - 2020-06-01T08:09:23+05:30 IST