ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణలో రూ.4 వేల కోట్లు స్వాహా

ABN, First Publish Date - 2020-09-14T08:25:55+05:30

రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో వైసీపీ నాయకులు రూ.4 వేల కోట్లు స్వాహా చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణ


నర్సీపట్నం టౌన్‌(విశాఖపట్నం), సెప్టెంబరు 13: రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో వైసీపీ నాయకులు రూ.4 వేల కోట్లు స్వాహా చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎకరా రూ.10 లక్షల విలువ చేసే భూమికి రూ.40 లక్షలు నుంచి రూ.50 లక్షలు చెల్లించారని.. ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.150 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు.


పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, చేతకానితనం వల్లే కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని అయ్యన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీకి 40 వేల ఎకరాలు సేకరించారని, అందులో నాలుగు వేల ఎకరాలు మాత్రమే కోర్టు వివాదాల్లో ఉన్నాయని.. పేదలపై ప్రేమ ఉంటే మిగిలిన 36 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Updated Date - 2020-09-14T08:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising