ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై దాడుల వెనుక అధికారపార్టీ నేతలు

ABN, First Publish Date - 2020-08-11T08:36:53+05:30

రాష్ట్రంలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మండిపాటు
  • మహాజన సైన్యం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన యాత్ర ప్రారంభం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 10: రాష్ట్రంలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి. అంజయ్య మండిపడ్డారు. దళితులపై దాడులను నిరసిస్తూ మహాజన సైన్యం చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన యాత్రను ఎస్వీయూలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ......  రాష్ట్రంలో దళితులపై దాడుల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కఠిన శిక్షలు అమలు కాకపోవడంతోనే ఈ అనుమానం కలుగుతోందని తెలిపారు. దళితులపై దాడుల పట్ల విద్యార్థులు, యువత స్పందించాలని కోరారు.  మహాజన సైన్యం అధ్యక్షుడు చేపూరి సురేంద్ర మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన దళితులపై దాడులకు నిరసనగా 13 జిల్లాల్లో నిరసన యాత్రలు చేపడుతున్నామని తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేస్తామన్నారు.   ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి నాయకులు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-08-11T08:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising