ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీమ ప్రాజెక్టుపై పునర్విచారణ

ABN, First Publish Date - 2020-08-22T09:02:12+05:30

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోత ల పథకం ప్రాజెక్టు అనుమతులపై పునర్విచారణ జరిపేందుకు జాతీయ హరిత ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ అభ్యర్థనకు ఎన్‌జీటీ అంగీకారం

ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం


న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోత ల పథకం ప్రాజెక్టు అనుమతులపై పునర్విచారణ జరిపేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) అంగీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికపై తమ పరిశీలనలు, అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం కల్పించడానికి కేసుపై తిరిగి విచారణ జరపాలని తెలంగాణ దాఖలు చేసిన దరఖాస్తుపై శుక్రవారం ట్రైబ్యునల్‌ న్యాయ సభ్యుడు జస్టిస్‌ రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే దీనిపై ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి అభ్యంతరం తెలిపారు. కమిటీ నివేదికపై పిటిషనర్‌ అభ్యంతరా లు, పరిశీలనలు చెప్పినప్పుడు తెలంగాణకి ఏమైందని ప్రశ్నించారు. సమయం లేదని అనడం సరికాదన్నారు. ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని.. పిటిషనర్‌, తెలంగాణ ప్రభుత్వం కు మ్మక్కయ్యారని ఆరోపించారు.


పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిందని, పిటిషనర్‌కు మద్దతిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును ఆపడం కోసం ఉద్దేశపూర్వకంగా ఎన్‌జీటీ, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ట్రైబ్యునల్‌ జోక్యం చేసుకుని.. తెలంగాణ వాదనలు కూడా వింటామని, లేదంటే తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదిస్తూ.. మళ్లీ విచారణ జరిపే బదులు తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరాలు, పరిశీలనలను రాతపూర్వకంగా స్వీకరించాలని.. వాటిని పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వాలని కోరారు. ఈ నెల 28న తుది వాదనలు వింటామని తెలిపింది.

Updated Date - 2020-08-22T09:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising