రైతును రాజును చేయాలనే సంస్కరణలు: సోము
ABN, First Publish Date - 2020-12-28T08:54:58+05:30
రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయంలో సంస్కరణలు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
మంగళగిరి, డిసెంబరు 27: రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయంలో సంస్కరణలు తెచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో ఆదివారం రైతు సాధికారత మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రైతాంగ అభివృద్ధి దేశాభివృద్ధిగా బీజేపీ చూస్తోందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.
Updated Date - 2020-12-28T08:54:58+05:30 IST