ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నం జైలుకు కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2020-07-05T00:34:18+05:30

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను మచిలీపట్నం జైలుకు తరలించారు. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను జడ్జి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30వరకు గూడూరు స్టేషన్‌లోనే రవీంద్రను పోలీసులు ఉంచారు. సాయంత్రం 6.30కు కొల్లు రవీంద్రను మచిలీపట్నం సబ్‌ జైలుకు పోలీసులు తరలించారు.


గత నెల 29న మచిలీపట్నంలో మోకా భాస్కర్‌రావు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. మచిలీపట్నంలోని చేపలమార్కెట్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు సోమవారం ఉదయం 11గంటల సమయంలో  భాస్కరరావు ద్వి చక్రవాహనంపై వచ్చారు. చేపలమార్కెట్‌ నుంచి బయటకు వస్తుండగా కొందరు దుండగులు బైక్‌పై వచ్చి ఆయనపై కత్తులతో దాడి చేశారు. గుండెలో కత్తులతో పొడవడంతో భాస్కర్‌రావు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. భాస్కర్‌రావు హత్య కేసులో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2020-07-05T00:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising