ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కోసం వచ్చి.. వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2020-03-31T09:17:53+05:30

నిత్యావసర సరకుల కోసం రేషన్‌ డిపోకు వచ్చిన ఓ వృద్ధురాలు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి ప్రాణం విడిచింది. విశాఖపట్నం జిల్లా చోడవరం ద్వారకానగర్‌కు చెందిన మీరాబీ(69) సోమవారం ఉదయం సరకులు తీసుకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం, మార్చి 30: నిత్యావసర సరకుల కోసం రేషన్‌ డిపోకు వచ్చిన ఓ వృద్ధురాలు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి ప్రాణం విడిచింది. విశాఖపట్నం జిల్లా చోడవరం ద్వారకానగర్‌కు చెందిన మీరాబీ(69) సోమవారం ఉదయం సరకులు తీసుకునేందుకు బాలాజీనగర్‌లోని డిపోకు వెళ్లారు. డిపో వద్ద అప్పటికే భారీ ఎత్తున క్యూ ఉండడంతో చాలాసేపు వేచివున్నారు. ఉదయం 10 గంటల సమయానికి ఎండ తీవ్రత ఎక్కువైంది.  అసలే వృద్ధాప్యం, ఆపైన మండుటెండలో నిలబడాల్సి రావడంతో తట్టుకోలేక మీరాబీ సొమ్మసిల్లిపడిపోయింది. విషయం తెలిసిన ఆమె మనవడు డిపో వద్దకు వచ్చి ఇంటికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచింది. మీరాబీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె బంధువు తార తెలిపారు. డిపో వద్ద జరిగిన ఆలస్యం వల్ల ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయినట్టు చెప్పారు.  మీరాబీ డిపో వద్ద మృతిచెందలేదని, ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు బంధువులు కూడా చెప్పారని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు చెప్పారు.

Updated Date - 2020-03-31T09:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising