ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై సీఎం జగన్ కుట్రలు: రామ్మోహన్ నాయుడు

ABN, First Publish Date - 2020-07-02T18:06:50+05:30

టీడీపీ నేతలపై సీఎం జగన్ కుట్రలు చేసి, కేసుల్లో ఇరికిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేతలపై సీఎం జగన్ కుట్రలు చేసి, కేసుల్లో ఇరికిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. అచ్చెన్నాయుడును ఎలాగైనా జైల్లో పంపాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సర్జరీ జరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు పూర్తిగా కోలుకోకుండానే డాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి, దొంగ రిపోర్టులు సృష్టించి అచ్చెన్నను అరెస్టు చేసి జైలుకు తరలించారంటే.. జగన్ ఏ రకంగా ఆయనను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారో అర్థమవుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అచ్చెన్నను జైల్లో పెట్టాలని సీఎం జగన్ ముందే రంగం సిద్ధం చేసుకున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.


సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని, హక్కులను ఉల్లంఘిస్తూ ఈ రకంగా వ్యవహరించడం రాష్ట్రానికి దౌర్భాగ్యమైన పరిస్థితి అని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందని.. ఇప్పుడూ చేస్తుందని ఆయన అన్నారు. న్యాయపోరాటం చేస్తూ.. ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని స్పష్టం చేశారు.


కాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వెంటనే ఆయనను పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అచ్చెన్నను.. వీల్ చైర్‌లో అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అచ్చెన్న డిశ్చార్జిలో హైడ్రామా నెలకొంది. అచ్చెన్న ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని వైద్యుల కమిటీ తెలిపింది. అయితే కమిటీపై ఒత్తిడి పెంచి డీఎంఈ డిశ్చార్జ్ రాయించారు. మధ్యాహ్నం నుంచి జీజీహెచ్‌లోనే డీఎంఈ ఉండి  ఒత్తడి చేయడంతో వైద్యులు తలొగ్గారు. 

Updated Date - 2020-07-02T18:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising