ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు.. పోలీసుల అదుపులో పిటిషనర్‌

ABN, First Publish Date - 2020-09-14T21:53:53+05:30

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు వివాదం ఇంకా కొనసాగుతోంది. మంగళవారం హైకోర్టులో అంబటి మైనింగ్ కేసు విచారిస్తారు. అయితే పిటిషనర్ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కేసు వివాదం ఇంకా కొనసాగుతోంది. మంగళవారం హైకోర్టులో అంబటి మైనింగ్ కేసు విచారిస్తారు. అయితే పిటిషనర్ నల్లగొర్ల రామయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామయ్యను ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. సెటిల్‌మెంట్‌కి రావాలని రెండు రోజులుగా రామయ్యపై అధికార పార్టీ ఒత్తిడి పెంచుతోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. పల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నుంచి ఫోన్లు వచ్చినట్లు చెబుతున్నారు. 


అంబటి రాంబాబు, ఆయన అనుచరులు వైట్‌ లైమ్‌స్టోన్‌ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని గనుల శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కుబాద్పురం గ్రామాల పరిధిలో ఉన్న సర్వే నంబర్లు 358/48ఏ, 384/2, 412, 413, 414, సమీపంలోని ప్రభుత్వానికి చెందిన భూముల్లో అంబటి రాంబాబు, ఆయన అనుచరులైన భవనాసి నరసింహారావు, నెల్లూరి మధుబాబు, దూదేకుల మౌలాలి, గిరిగిపాటి రేణుకస్వామి, పుణ్యాల రామిరెడ్డి, మారెళ్ల సాంబశివారెడ్డి, దూదేకుల శ్రీను బాషా, బుర్రి రాంబాబు అక్రమంగా వైట్‌ లైమ్‌స్టోన్‌ తవ్వకాలకు పాల్పడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ వైసీపీ కార్యకర్తలైన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురికి చెందిన పప్పుల శ్రీనివాసరెడ్డి, కొండమోడుకు చెందిన నల్లగొర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2020-09-14T21:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising