ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై మండిపడ్డ సీపీఐ నేత రామకృష్ణ

ABN, First Publish Date - 2020-06-05T00:51:04+05:30

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. రైతు సంక్షేమం పట్ల కేంద్రం తీరు 'మాటలు ఘనం - చేతలు శూన్యం'గా ఉన్నాయని ఆరోపించారు. 70 ఏళ్ల రైతు చిరకాల కల తీర్చిన వ్యక్తిగా బీజేపీ నేతలు నరేంద్రమోదీని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. రైతు సంక్షేమం పట్ల కేంద్రం తీరు 'మాటలు ఘనం - చేతలు శూన్యం'గా ఉన్నాయని ఆరోపించారు. 70 ఏళ్ల రైతు చిరకాల కల తీర్చిన వ్యక్తిగా బీజేపీ నేతలు నరేంద్రమోదీని కీర్తిస్తున్నారని తప్పుబట్టారు. మోదీ కార్పొరేట్ శక్తుల పక్షపాతేగాని రైతుల పక్షపాతికాదనేది జగమెరిగిన సత్యమన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్భాటంగా ప్రకటించిన ఆత్మ నిర్భర ప్యాకేజీలో కూడా వ్యవసాయదారులకు ఒరగబెట్టిందేమీ లేదని చెప్పారు. మోదీ అధికారంలో ఉన్న ఆరేళ్లలో కార్పొరేట్ శక్తులకు రూ.6.60 లక్షల కోట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేశారని, కానీ రైతుల రుణాలను మాఫీ చేయటంలో ఎందుకు చిత్తశుద్ధి చూపలేదు? అని ప్రశ్నించారు. వరికి కేవలం రు.53 మద్దతు ధర పెంచి గొప్పలు చెప్పుకోవడం సరికాదని రామకృష్ణ ఆక్షేపించారు.

Updated Date - 2020-06-05T00:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising