ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రజనీ రాజకీయాల్లోకి వచ్చినా.. ఢోకా లేదు..’

ABN, First Publish Date - 2020-09-14T15:38:36+05:30

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చినా, మరెవరైనా పార్టీని ప్రారంభించినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని మంత్రి కడంబూర్‌ రాజు అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(ఆంధ్రజ్యోతి): తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చినా, మరెవరైనా పార్టీని ప్రారంభించినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని మంత్రి కడంబూర్‌ రాజు అన్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేని గెలిపించాలని రాష్ట్ర ప్రజలంతా సిద్ధమైపోయారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిల్‌పట్టి వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎన్నటికీ చెక్కుచెదరదని, రానున్న ఎన్నికల్లోనూ గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నీట్‌ను రద్దు చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని, ఆ దిశగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నీట్‌ అమలు కావడానికి కాంగ్రెస్‌, డీఎంకే ప్రభుత్వాలు అనుసరించిన తప్పుడు విధానాలే కారణమన్నారు. నీట్‌కు విద్యార్థులు భయపడకూడదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబీకులను శోకసముద్రంలోకి నెట్టకూడదని ఆయన కోరారు.

Updated Date - 2020-09-14T15:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising