ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు

ABN, First Publish Date - 2020-08-15T22:12:05+05:30

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాలేరు నది, మున్నేరు పరవళ్లు తొక్కుతున్నాయి. వరదతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వత్పవాయి మండలం లింగాల వద్ద మున్నేరు పొంగి బ్రిడ్జి పైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. నందిగామ మండలం కూడలి దామూలూరు వద్ద వైర, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంతో నందిగామ-వీరులపాడు మండలాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కంచికచెర్ల మండలం కీసర వద్ద  వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. 75 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి చేరింది. ప్రకాశం బ్యారేజి పరివాహక ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు మరో మూడు రోజుల ఇదే విధంగా కొనసాగుతుందంటుని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-15T22:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising