తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు
ABN, First Publish Date - 2020-09-14T20:09:15+05:30
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. విశాఖలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెప్పారు.
అటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Updated Date - 2020-09-14T20:09:15+05:30 IST