ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పై మరోసారి రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-12-30T01:59:45+05:30

సీఎం జగన్‌పై మరోసారి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు/ఢిల్లీ: సీఎం జగన్‌పై మరోసారి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటన చాలా దారుణం. మీ ప్రభుత్వంలో ఈ ఘటనకు ముఖ్యమంత్రిగా మీకు సిగ్గు అనిపించడం లేదా? జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదు. సీఎం గారు మీకు హిందువులంటే అంత చులకనా? హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వంలో వరుస సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోండి’ అని రఘురామకృష్ణరాజు కోరారు.

Updated Date - 2020-12-30T01:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising