ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోన అందాలను చూడటానికి ఎవరూ రావొద్దు: రాఘవేంద్ర ప్రసాద్

ABN, First Publish Date - 2020-08-03T19:39:44+05:30

అనంతపురం: యాడికి మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద ఉన్న కోన అందాలను చూడటానికి ఎవరూ రావొద్దని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర ప్రసాద్ ప్రజలను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: యాడికి మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద ఉన్న కోన అందాలను చూడటానికి ఎవరూ రావొద్దని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర ప్రసాద్ ప్రజలను కోరారు. చుట్టూ పచ్చని కొండలు.. జాలువారుతున్న జలపాతాలతో కోన ప్రస్తుతం మరింత రమణీయంగా మారింది. మరోవైపు కోన రామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న అందాలను వనమూలికలు కలిగిన శక్తివంతమైన వృక్షాలను చూడడానికి పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు.


అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న తరుణంలో ఈ కోన అందాలు చూడటానికి వచ్చిన పర్యాటకులు వల్ల చుట్టూ ఉన్న గ్రామాలకు కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. దీంతో ముందస్తుగా పర్యాటకులు ఎవరూ కూడా కోనా అందాలను చూడటానికి రావద్దని రాఘవేంద్ర ప్రసాద్ కోరారు. అలా కాకుండా పర్యాటకులు రావడం గుంపులు గుంపులుగా ఉండడం వంటివి తమ కంట పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తమ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో కోన అందాల ప్రాంతం ఉంటుందన్నారు. రాఖీ పౌర్ణమి నాడైన సోమవారం నుంచి షరతులు అమలులో ఉంటాయని రాఘవేంద్ర ప్రసాద్ తెలిపారు

Updated Date - 2020-08-03T19:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising