ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగులకు ప్రత్యేక గదులు

ABN, First Publish Date - 2020-03-25T09:16:50+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా తూర్పు గోదావరిజిల్లాలో అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో అత్యధిక శాతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘తూర్పు’లో నెగెటివ్‌ ప్రెజర్‌ రూమ్‌ల ఏర్పాటు


కాకినాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా తూర్పు గోదావరిజిల్లాలో అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో అత్యధిక శాతం మంది ఈ జిల్లాలోనే ఉండడంతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


అందులో భాగంగా కరోనా సోకిన రోగి శ్వాస ద్వారా వదిలే గాలి నేరుగా బయటకు వెళ్లి వైరస్‌ విస్తరించకుండా ఉండేందుకు కాకినాడ జీజీహెచ్‌లో అధునాతన వసతులతో కూడిన నెగెటివ్‌ ప్రెజర్‌ ఐసోలేషన్‌ రూములను సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ గదులు అందుబాటులోకి రానున్నాయి. రూ.1.30 కోట్ల వ్యయంతో నిర్మించే ఎనిమిది గదుల్లో ఒక్కో రోగిని ఉంచి చికిత్స అందిస్తారు. ఈ నెగెటివ్‌ ప్రెజర్‌ ఐసోలేషన్‌ గదుల్లో ఆదునిక టెక్నాలజీతో తయారుచేసిన హెపా ఫిల్టర్లు అమర్చుతారు. ఇవి కరోనా రోగి తన శ్వాస ద్వారా వదిలిన గాలిని అక్కడికక్కడే శుద్ధి చేస్తాయి. రోగి వదిలిన వైర్‌సను పూర్తిగా నిర్మూలిస్తాయి. ఆ తర్వాత వైరస్‌ రహిత స్వచ్ఛమైన గాలిగా మార్చి ఈ ఫిల్టర్ల ద్వారా బయటకు వదులుతాయి.

Updated Date - 2020-03-25T09:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising