ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని లేకున్నా రావాల్సిందే!

ABN, First Publish Date - 2020-03-29T09:26:01+05:30

పని లేకున్నా సిబ్బందిని డిపోలకు రావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వాటిని పాటించాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పీటీడీ సిబ్బందికి అధికారుల ఆదేశం


అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పని లేకున్నా సిబ్బందిని డిపోలకు రావాలంటూ  అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో వాటిని పాటించాలో... పోలీసులతో దెబ్బలు తినాలో తెలియక ప్ర జా రవాణా శాఖ(పీటీడీ) సిబ్బంది ఆందోళన చెం దుతున్నారు. కరోనా దెబ్బకు అన్నీ మూతపడటంతో ఆర్టీసీ బస్సులు కూడా తిరగడంలేదు. ఈ పరిస్థితు ల్లో గ్యారేజీ సిబ్బంది విధులకు రావాలంటూ డిపో మేనేజర్లు పిలుస్తున్నారు. గ్యారేజీ సిబ్బందితోపాటు సూపర్‌వైజర్లు కూడా రావాలని, రైతు బజార్లకు వెళ్లే ఐదు బస్సుల పర్యవేక్షణ చేయాలని చెబుతున్నారు. బయట కనిపిస్తే పోలీసులు కొడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో వస్తామని సిబ్బంది చెబుతున్నా అ ధికారులు వినడంలేదు. ఈ విషయమై ఇప్పటికే మంత్రి పేర్ని నాని ఉన్నతాధికారులతో మాట్లాడి అత్యవసర సర్వీసులకు మాత్రమే సిబ్బందిని పిలవాలని, అనవసరంగా వద్దని ఆదేశించారు. అది కూడా పోలీసు అనుమతి తీసుకుని ఒక వాహనం పంపి సిబ్బందిని డిపోలకు రప్పించుకోవాలని సూచించా రు. అందుకు భిన్నంగా పీటీడీ అధికారులు వ్యవహరిస్తుండటంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై గుర్తింపు కార్మిక సంఘం ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయమై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ బస్సులు ఎక్కువకాలం నిలిపి ఉంచేస్తే టైర్లు, బ్యాటరీ పాడవుతాయని అన్నారు. 

Updated Date - 2020-03-29T09:26:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising