గుంటూరు: మహాంకాళీ అమ్మవారి ఆలయం కూల్చివేతకు రంగం సిద్దం..
ABN, First Publish Date - 2020-12-04T18:08:30+05:30
మహాంకాళీ అమ్మవారి ఆలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు రంగం సిద్దం చేశారు.
గుంటూరు: నగరంలోని టిజేపీఎస్ కాలేజి వద్ద ఉన్న మహాంకాళీ అమ్మవారి ఆలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు రంగం సిద్దం చేశారు. దీంతో అధికారుల తీరుకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఆలయం వద్ద నిరసన చేపట్టాయి. హిందూ సంఘాలకు మద్దతుగా బీజేపీ, భజరంగ్‌దళ్, హిందూ ధర్మ పరిరక్షణ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. హిందూ దేవాలయాల కూల్చివేతే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఆలయం కూల్చివేత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-12-04T18:08:30+05:30 IST