పోలీసు స్టేషన్ సిబ్బందికి ప్రొటెక్షన్!
ABN, First Publish Date - 2020-07-08T08:18:10+05:30
విశాఖలో పోలీసులను కరోనా నుంచి రక్షించేందుకు స్టేషన్‌లలో ‘టేబుల్ షీల్డ్ ప్రొటెక్షన్’ని అందుబాటులోకి తెచ్చారు.
విశాఖలో పోలీసులను కరోనా నుంచి రక్షించేందుకు స్టేషన్‌లలో ‘టేబుల్ షీల్డ్ ప్రొటెక్షన్’ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే 18 మంది పోలీసులకు పాజిటివ్ రావడంతో సిబ్బంది భయాందళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీ ఆర్కే మీనా నిపుణులతో చర్చించి 8 అడుగుల ఎత్తుండే టేబుల్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను అన్ని స్టేషన్లు, అధికారు ల చాంబర్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అం టే.. దళసరి అద్దాన్ని అధికారి టేబుల్‌కు మూడు వైపులా అమర్చడం ద్వారా ఎవరైనా కరోనా వైరస్ కలిగినవారు వచ్చినప్పటికీ పోలీసులకు సోకకుండా రక్షణ కల్పిస్తుంది. తొలుత త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ చాంబర్‌తోపాటు మహారాణిపేట స్టేషన్ రిసెప్షన్ కౌంటర్ వద్ద వీటిని ఏర్పాటుచేశారు. నగరంలోని 23 పోలీస్ స్టేషన్లతోపాటు మొత్తం 50 చోట్ల వీటిని ఏర్పాటుచేయనున్నట్లు సీపీ తెలిపారు. - విశాఖ
Updated Date - 2020-07-08T08:18:10+05:30 IST