ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్సార్‌ ఆసరాలో రాజకీయ వివక్ష

ABN, First Publish Date - 2020-12-04T03:41:33+05:30

ప్రజలకు మాయమాటలు, చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పడం మడమ తిప్పటానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు కాలినడకన నిరసన ర్యాలీ నిర్వహించారు.

అధినేత చంద్రబాబుతో నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మేనిఫెస్టోలో చెప్పిందొకటి.. చేసేది మరొకటి

45 ఏళ్లు నిండిన అన్ని వర్గాల మహిళలకు పెన్షన్‌ ఏది?

మాట తప్పటం మడమ తిప్పడంలో జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

అసెంబ్లీలో సమాధానం చెప్పలేక సస్పెన్షన్‌

బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి

పర్చూరు, డిసెంబరు 3 : ప్రజలకు మాయమాటలు, చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డి మాట తప్పడం మడమ తిప్పటానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యేలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు కాలినడకన నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు కనిపించటం లేదన్నారు. అందుకు నిదర్శనం 45 ఏళ్లు నిండి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌లు ఇస్తానని చెప్పి వారిని మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో తీవ్ర వివక్ష ఉందని, సగం మందికి కూడా పథకం వర్తింపచేయలేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.3వేలు చేస్తామని చెప్పి రూ.2వేలు ఉన్న పెన్షన్‌ను రూ.250 పెంచి దగా చేస్తున్నారని విమర్శించారు. అదేమిటని ప్రశ్నిస్తే పెంచుకుంటూ పోతామని కల్లబొల్లి మాటాలు చెబుతున్నారన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. 

Updated Date - 2020-12-04T03:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising