నాడు-నేడు పనులకు నాసిరకం ఇసుక
ABN, First Publish Date - 2020-06-18T10:44:34+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అయితే ఆయా
కరవది జడ్పీ హైస్కూలులో అధ్వానంగా నిర్మాణ పనులు
గ్రామస్థుల ఆక్షేపణ
ఒంగోలు(రూరల్) జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అయితే ఆయా నిర్మాణ పనులకు నాసిరకం ఇసుకను వాడుతున్నారు. దీంతో పలుచోట్ల స్థానికులు ఆక్షేపిస్తున్నారు. ప్రధానంగా కరవది జడ్పీ ఉన్నత పా ఠశాలలో నాడు-నేడు పథకం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.41లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో తరగదులను టై ల్స్, గ్రానైట్ రాళ్లతో సుందరంగా తీర్చిదిద్దాలి. అలాగే పాఠశాలలో చెక్క పను లు, విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయాలి. కొత్తగా 8 మరుగుదొడ్లు నిర్మిం చాలి.
ఉన్నవి బాగు చేయాల్సి ఉంది. అయితే నాసిరకం ఇసుకతో పాఠశాలలో నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి ఏఈ రామమోహనరావును బుధవారం వివరణ కోరగా ఇసుక బాగానే ఉందని చె ప్పారు. అలాగే స్కూలు తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు మేడికొండ బుజ్జి వివరణ కోరగా సన్న ఇసుకను తోలారని, కొంత నాసిరకంగా ఉన్నదని చె ప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల అభివృద్ధి పనులకు నాణ్యమైన ఇసుకను తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2020-06-18T10:44:34+05:30 IST