భార్య హత్య కేసులో భర్త అరెస్టు
ABN, First Publish Date - 2020-12-31T01:12:15+05:30
భార్య హత్య కేసులో భర్త సయ్యద్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వీఆర్వో కళ్యాణ్ వద్ద లొంగిపోయిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీఆర్వో ద్వారా లొంగిపోయిన నిందితుడు
వివరాలు వెల్లడించిన సీఐ అల్తా్‌ఫహుస్సేన్
పర్చూరు, డిసెంబరు 30 : భార్య హత్య కేసులో భర్త సయ్యద్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వీఆర్వో కళ్యాణ్ వద్ద లొంగిపోయిన నిందితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వినియోగించిన కత్తి, కంఠనీలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో సీఐ అల్తా్‌ఫహుస్సేన్ బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరెంట్ పనిచేసుకొనే సయ్యద్‌బాబుతో షేక్ మీరాబీ పదిహేనేళ్ల నుంచి సహజీవనం చేస్తూ రెండో భార్యగా కొనసాగుతోంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. మృతురాలు పర్చూరులో నివాసం ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తుంది. ఈ తరుణంలో మృతురాలికి ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదే విషయంలో మీరాబీని సయ్యద్‌బాబు హెచ్చరించారు. ఈ నెల 25న ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టా తెచ్చుకోవటానికి వెళ్లి ఇంటికి వచ్చారు. పథకం ప్రకారం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో మీరాబీ గొంతు కోయటంతోపాటు శరీరంలో పలుచోట్ల తీవ్రమైన గాయాలు చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. ఆ తర్వాత పరారై 5 రోజుల తరువాత బుధవారం వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఈ కార్యక్రమంలో ఎస్సై వై.వి.రమణయ్య, హెడ్ కానిస్టేబుల్ రామానాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-31T01:12:15+05:30 IST