ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీతోనే సంక్షేమ పాలన సాధ్యం

ABN, First Publish Date - 2020-12-16T05:13:36+05:30

అభివృద్ధి సంక్షేమ పాలన వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటీ వనిత పేర్కొన్నారు.

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు సురేష్‌, సుచరిత, వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత

యండ్రపల్లిలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం

పుల్లలచెరువు, డిసెంబరు 15: అభివృద్ధి సంక్షేమ పాలన వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యం అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటీ వనిత పేర్కొన్నారు. యండ్రపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, హోం మంత్రి  మేకతోటి సుచరితతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మఒడి ద్వారా జనవరి 9న తల్లుల ఖాతాలకు రూ.15 వేల నగదు జమచేస్తారని అన్నారు. ఎర్రగొండపాలెంలో సివిల్‌కోర్టు, మార్కాపురంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని హోం మంత్రిని కోరారు. రాష్ట్రంలోని మూడు వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని అన్నారు.కార్పోరేట్‌కు దీటుగా  ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామన్నారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన వచ్చిన తరువాత మహిళలకు పూర్తి రక్షణ కల్పించామన్నారు. మహిళలకు ఏ ఆపద వచ్చినా దిశ యాప్‌, పోలీస్‌ ఉచిత నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దుసుకెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో  ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మిదేవి, ఆర్డీవో శేషారెడ్డి, తహసీల్దార్లు అశోక్‌రెడ్డి, వీరయ్య, పీఆర్‌ డీఈ రతన్‌బాబు, సీడీపీవో పద్మావతి, ఎంపీపీ అభ్యర్ధి మందా లాజరు, వైసీపీ మండల కన్వీనరు ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ మర్తాల సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు యల్లారెడ్డి రోశిరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, యండ్రపల్లి స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising