సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు
ABN, First Publish Date - 2020-11-14T02:58:28+05:30
ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు అని విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
పుల్లలచెరువు, నవంబరు 13: ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లు అని విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం పుల్లల చెరువులో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పుల్లలచెరువు చిన్నకండ్లేరుకు అనుసంఽధానం చేసి శాశ్వతంగా కరువును తరిమి కొడతామని అన్నారు. తీగలేరు 5 కాలువకు రూ.83 కోట్లు మంజూరు చేయించి త్వరలోనే శంకుస్థాపన పనులు చేసి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. మర్రివేముల, ముటుకుల, శతకోడు గ్రామ పంచాయతీల్లో శాశ్వతంగా కరువును నివారించేందుకు వరికపూడిశెల ప్రాజెక్టు ద్వారా సాగు నీరు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనరు ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి మందా లాజరు, మాజీ ఎంపీపీ మార్తల సుబ్బారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆవుల వెంకటరెడ్డి మండల నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, యాల్లారెడ్డి రోశిరెడ్డి, రఘు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T02:58:28+05:30 IST