సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట
ABN, First Publish Date - 2020-12-11T05:51:27+05:30
సంక్షేమ కార్యక్రమాలతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు.
తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
గిద్దలూరు టౌన్, డిసెంబరు 10 : సంక్షేమ కార్యక్రమాలతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. గిద్దలూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత నిరంతరం ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తున్నారన్నారు. అధికారులు ప్రజాసమస్యలను పరిష్కరించడంలో ఎప్పటికప్పుడు చొరవ తీసుకుని పని చేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంతోపాటు కార్యాలయంలోని వివిధ భవనాలను కూడా పలు శాఖల అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్‌డీవో శేషిరెడ్డి, సీఐ యు.సుధాకర్‌రావు, మున్సిపల్ కమిషనర్ హేమావతి, తహసీల్దార్ రాజారమేష్ ప్రేమ్‌కుమార్, వైసీపీ నాయకులు భూమా నరసింహారెడ్డి, దప్పిలి కాశిరెడ్డి, సీఆర్‌ఐ మురళి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T05:51:27+05:30 IST