ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి దశలోనే వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణం

ABN, First Publish Date - 2020-12-06T05:44:46+05:30

ల్లాలో రెండు దశల్లో నిర్మించనున్న వా టర్‌ గ్రిడ్‌లలో మార్కా పు రాన్ని మొదటి దశలో చే పట్టేందుకు ముఖ్య మం త్రి అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే కుందురు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, డిసెం బరు 5 : జిల్లాలో రెండు దశల్లో నిర్మించనున్న వా టర్‌ గ్రిడ్‌లలో మార్కా పు రాన్ని మొదటి దశలో చే పట్టేందుకు ముఖ్య మం త్రి అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి తెలిపారు. స్థాని క టీటీడీ కల్యాణ మండప ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా గిద్దలూరు, దర్శి, కనిగిరి ఎమ్మెల్యేలతో పాటు తాను సీఎంని కలవడం జరిగిందన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు సంబంధించి రూ.2300 కోట్లు త్వరలో మంజూరు చేయ నున్నట్లు ఆయన తెలిపారన్నారు. మార్కాపురంలో  ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలకు రూ.350 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారన్నారు. మార్కాపురం చెరువు సప్లయ్‌ చానల్‌,  ఇతర ప్రాంతాల్లో నీటి పారుదల సమస్యలపై మంత్రి కన్నబాబును కలిసి ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. టీటీడీ కల్యాణ మండపాన్ని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎ మ్మెల్యే వెంట పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు చిల్లంచెర్ల బాలమురళీ కృష్ణ, నల్లబోతుల కొండయ్య, మాజీ కౌన్సిలర్లు షేక్‌ ఇస్మాయిల్‌, బుశెట్టి నాగేశ్వరరావు, కరీం బాషా ఉన్నారు. 


Updated Date - 2020-12-06T05:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising