వరి సాగుకు నీరు అందించేందుకు ప్రణాళికలు
ABN, First Publish Date - 2020-11-14T02:42:03+05:30
కంభం చెరువు ఆయకట్టు కింద భూములకు ఈ సీజన్‌లో సాగు నీరు అందించెందుకు అధికారులు తగు జాగ్రతలు తీసుకోవాలని స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు.
బేస్తవారపేట, నవంబరు 13: కంభం చెరువు ఆయకట్టు కింద భూములకు ఈ సీజన్‌లో సాగు నీరు అందించెందుకు అధికారులు తగు జాగ్రతలు తీసుకోవాలని స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. శుక్రవారం బేస్తవారపేట మండలంలోని పాపాయిపల్లె వాగు వద్ద జరుగుతున్న పంట కాలువ పూడికతీత పనులను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ కంభం చెరువు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించి వరి సాగుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. కంభం చెరువు కింది పాపాయిపల్లె కాలువ, సీతురేలు కతువకాలువ, పెద్ద కంభం కాలువ, కంభం చెరువు అలుగు, చిన్న కంభం కాలువలకు సంబంధించి 22 పనులకు రూ.70లక్షలతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. పనులు జరగాలని అన్నారు. నవంబరు చివరినాటికి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కంభం చెరువు కింద ప్రతి ఎకరాకు నీరు అందించాలని అన్నారు. కార్యాక్రమంలో ఇరిగేష్ ఎస్సీ రెడ్డయ్య, ఈఈ లక్ష్మిరెడ్డి, ఆర్డీవో ఎం.శేషారెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డి, తహశీల్దార్ సుబ్బారావు, ఎంపీడీవో చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T02:42:03+05:30 IST